Wednesday, 27 December 2017

ఆనందపు కలలు

కలలు చిట్లిపోగానే నిదుర లేచాను 
వేకువలో మరో క్రొత్తవెలుగు చూడాలని  
ఎన్నాళ్ళైనా ఆశగా ఎదురు చూస్తుంటాను 
ఆలోచన స్వాధీనంలోకి రాక మొరాయిస్తుంటే
మెదడులో మోసుకుని తిరుగుతూనే ఉంటాను.
ఆశ పుట్టిన రాత్రుల్లో ఆశ చావని రాత్రుల్లో
చలికి ముడుచుకునే వేళ్ళన్నింటినీ పైకెత్తి
ఊహల్లోని బొమ్మలను గీసి చుసుకుంటాను
వెలుగు నన్ను తాకినప్పుడల్లా ఓడిపోతూ
రాత్రి వెనుక రాత్రి జారినప్పుడు గెలుస్తున్నట్లు
కలల్లో ఆనందపు అంచులు తాకుతాను...  

Friday, 15 December 2017

కలలో వచ్చి

నీ కనులతో కళ్ళు కలిపి 
నన్ను నేను ఓడిపోయాను 
మనసు దోచి దాగుడుమూతలు 
దీపం వెలిగించి చీకటి చేసావెందుకు?
కలలో వచ్చి కునుకు దోచావు
మెలకువలో ఒంటరిని చేసావెందుకు?
నీ ప్రేమలో వెర్రిదాన్ని అయితి
నీతో మనసు ఇచ్చేసి
నన్ను నేను కోల్పోయాను..
నిన్ను కలవకపోతే  నా కనులు
వెర్రి మనసు నిశ్చింతగా నిదురోయేది   

Wednesday, 6 December 2017

కలల విందు

కునుకులమ్మ తీపికలల విందు చేసింది
ఆవలింతల ఆకు వేసి రమ్మని పిలిచింది 
చీకటి చెదిపోయే వరకూ నిదురపోయి 
వేకువ వచ్చి మేలుకొలిపే వరకూ 
కలల విందును ఆరగించమంది...... 

Friday, 17 November 2017

వాస్తవ కలలు..

మనం మన్లో చిదిమేసిన ఊహలు
బలవంతగా అణిచి వేసిన కోరికలు 
మన నిద్రలో మన వివేకం నిద్రపోయాక
కలల రూపంలో స్వైర విహారం చేస్తుంటాయీ.. 
కలల్లో మనం చూస్తాం వింటాం మాట్లాడతాం
పంచేంద్రియాలు పనిచేస్తున్నట్లే అనిపిస్తుంది
ఎన్ని కలలు కన్నా దేనికదే ప్రత్యేకం..
అందుకే కలలు కలలే వాస్తవాలు కావు!!!

Thursday, 9 November 2017

కల

కళ్ళుమూసుకుని కలలు 
కన్నంత సులభం కాదు
కనులు తెరచి కలలను 
జీవితంలో నిజం చేసుకోవడం! 

Thursday, 26 October 2017

సుందర స్వప్నం

చొరవ చేసి చెలీ అని పిలిచి
కలుపుగా కలిసి అలుపు తీర్చి 
సరిక్రొత్త బంధం పెనవేసావు..

కలగనని వైనం కంటికి చూపి
వెన్నెల కూడిన తేజం అందించి
సుందర స్వప్నం అయినావు.. 

ఎడారిలాంటి గొంతు తడార్చి
గుండెలలో సవ్వడి మ్రోగించి  
నన్ను వీడక నాతో ఉన్నావు..

Monday, 9 October 2017

కమ్మని కల

తన తలపుల్లో తనువు తల్లడిల్లే
తలచినదే తడువుగా తను అగుపడ  
తన్మయత్వపు తమకంలో తనువు తడిసె
తనలో నేను నాలో తను ఏకమవ్వాలని
జగమును మరిచి తరించాలని..
కోరికలు ఎన్నో తలపులలో తిడిగాడె 
తన కోసం నేను నాకోసం తను 
పుట్టామని మనసు గట్టిగా పలికె
కలలోనైనా తీరు అమేయముగా తోచె
కమ్మని కల నిజమైతే ఎంత మధురమో!

Thursday, 28 September 2017

కల

కలయైనా నిజమైనా నిరాశలో ఒకటే

పగలైనా రేయైనా అంధునికి ఒకటేలే

Monday, 11 September 2017

ఆసరా

నాకూ తెలుసునులే..
కంటున్నవీ కనబోయే కలలు
కల్పితాలనీ, ఆశలు అసంకల్పితమనీ
అయినా జీవించడానికి ఏవో కొన్ని
అభూత కల్పనలు ఆసరా కావాలి కదా!  

Saturday, 2 September 2017

కలతో ఆట

తాళ్ళతో బంధించినా సరే ఎందుకో
మనసు ముందుకు పరుగులిడుతుంది
కలలతో ఆడుతూనే నిదురించి 
లేస్తుంది...లేచి పరుగులెడుతుంది!
రాత్రంతా స్వప్నాల్లో మేల్కొని జాగారం చేసి 
పగలు అలసి అలకచెంది సాగనన్నది
సంధ్యవేళలో గుర్తించనట్లు నటిస్తూ
జ్ఞాపకాలు మళ్ళీ ఊపిరిపోసుకుంటున్నాది
కనులు చెమ్మగిల్లి సరిహద్దు లేని కన్నీటిలో 
కలలు కరిగిపోయి కొత్తకలతో ఆడుకోవాలని 
నిదురించే ప్రయత్నం చేస్తుంది మనసు.. 
కలతో ఆడుకుంటూ నిదురిస్తున్నాను నేను..

Wednesday, 30 August 2017

నా స్వప్నాలు

కన్నుల వెనుక స్వప్నంలో
మాటల వెనుక మౌనంగా
శ్వాస వెనుక స్పందనలా
విజయం వెనుక శ్రమవలె
గమ్యం వెనుక పయనమై
ఉండేవే నా కలలు ఊహలు 

Saturday, 26 August 2017

మూసిన కళ్ళలో

కళ్ళు ముస్తేనే కల .....
కళ్ళు తెరిస్తే కరిపోయేను ఎలా?
నీ తపనలో నేను 
నా మనసును ఇలా వదిలేసాను!
కలలో నా కనులముందు ఉంటావు
ఇలలో రెక్కలున్నాయంటూ ఎగిరిపోతావు
అందుకే నువ్వు ఎప్పుడు గుర్తుకు వచ్చినా
కనులు మూసుకుని నిదుర పోతుంటాను!! 

Monday, 14 August 2017

15th Aug 2017

మనం కలగన్న స్వాతంత్య్ర భారతదేశాన్ని... 
అందరం కలిసిమెలిసి సుసంపన్నమై వర్ధిల్లేలా సం రక్షించుకుందాం
భారమాతకు జేజేలు జన్మభూమికి నమోఃవందనములు...  

Wednesday, 9 August 2017

కృషి..

సరైన కలలు కంటే సహకారం లభిస్తుంది
అవే పెట్టుబడులై మన ఉన్నతికి కారణం అవుతాయి
మన కలలు ప్రత్యేకంగా ఉంటే ప్రకాశిస్తాయి 
విభిన్న మార్గాల్లో ప్రయత్నిస్తే ఫలిస్తాయి 
నీవు ఎవరు ఏమిటని కలలు చూడవు 
నీకృషి ప్రయత్నాన్ని చూసి కలలు నిజమౌతాయి. 

Sunday, 6 August 2017

కునుకులో

కునుకులో కన్న కలలు ఏం చేయలేమని  
కాళ్ళు చాపుకుని కదలకుండా కూర్చుంటే 
కన్న కల కరిపోయి నిరాశ మిగులుతుంది 
కార్యాచరణలో పెడితే స్వప్నం నిజమౌతుంది 

Friday, 4 August 2017

కలత

కునుకు పడితే కలల ప్రపంచం ఎంతో సుందరం
కలత చెందితే మనసు పడుతుంది ఆరాటం...

Thursday, 3 August 2017

తీర్చుకునే కలలు కొన్ని

కలువకు చంద్రుడు దూరం కనుకనే చంద్రుడి పై కమలానికి అంత మమకారం...
జీవితం అందంగా ఆనందంగా ఉండదు కనుకనే కలల ద్వారా వాటిని నెరవేర్చుకుంటాం...
కలలు కనడం తప్పు కాదు కానీ వాటిని నిజం చేసుకునే ప్రయత్నం చేయకపోవడం నేరం...  

Wednesday, 2 August 2017

కలలు

కలలు కనడం అందరి జన్మ హక్కు

నెరవేర్చుకోకపోవడం మన తప్పు

బ్రతికున్నంత కాలం కలలు కంటుందాం 

తీర్చుకునే ప్రయత్నం మాత్రం తప్పక చేద్దాం