Wednesday 6 December 2017

కలల విందు

కునుకులమ్మ తీపికలల విందు చేసింది
ఆవలింతల ఆకు వేసి రమ్మని పిలిచింది 
చీకటి చెదిపోయే వరకూ నిదురపోయి 
వేకువ వచ్చి మేలుకొలిపే వరకూ 
కలల విందును ఆరగించమంది...... 

2 comments:

Sri[dharAni]tha said...

కునుకురాని నయనాన జ్ఞాపకాల కదలికలు
చెమర్చిన కన్నుల లోగిలిలో తడారిన భావాలు
పంతం పంథాలో కాలపు చమత్కారాలు
ఎదురు చూపులకు అలవాటు పడి అలకల కులుకులు

కలలపై ఇన్ని కవితలు వ్రాయగలరని నిరుపితం చేశారు. బహుశ మీకు నిద్రంటే చాలా ఇష్టం అనుకుంట.

అలసటలో సేదతీర్చేది నిద్ర
మనసును తేలిక పర్చేది నిద్ర
నిన్నటి రేపు రేపటి నిన్న నడుమ వారధి నిద్ర
నిద్ర పడితే కలలన్ని మనసులో భావాల రూపాలు

Padmarpita said...

బాగుంది విందు.