Saturday 2 September 2017

కలతో ఆట

తాళ్ళతో బంధించినా సరే ఎందుకో
మనసు ముందుకు పరుగులిడుతుంది
కలలతో ఆడుతూనే నిదురించి 
లేస్తుంది...లేచి పరుగులెడుతుంది!
రాత్రంతా స్వప్నాల్లో మేల్కొని జాగారం చేసి 
పగలు అలసి అలకచెంది సాగనన్నది
సంధ్యవేళలో గుర్తించనట్లు నటిస్తూ
జ్ఞాపకాలు మళ్ళీ ఊపిరిపోసుకుంటున్నాది
కనులు చెమ్మగిల్లి సరిహద్దు లేని కన్నీటిలో 
కలలు కరిగిపోయి కొత్తకలతో ఆడుకోవాలని 
నిదురించే ప్రయత్నం చేస్తుంది మనసు.. 
కలతో ఆడుకుంటూ నిదురిస్తున్నాను నేను..

4 comments:

Anonymous said...

నిద్రలో కలలుకనే అదృష్టం అందరికీ రాదు

Padmarpita said...

కలత నిదుర పోకండి...మంచి కలలు రావు.

కమల said...

thanks to anonymous & padmarpita.

Sri[dharAni]tha said...

రంగు రంగుల వాస్తవ ప్రపంచాన్ని అవలీలగా ఆస్వాదిస్తే
కమనీయమైన కలలెన్నో కనుల లోగిలి ముంగిట చేర వచ్చే
కలవరపాటుగా భంగ పడితే కలత చెందిన మనసులో
రేగే అన్యమనస్క ధోరణి వలన భీతిల్లి పీడకలలే నిదురలో
గడిచిన గడియల సంక్షిప్త రూపం కమ్మని కల
ప్రస్తుతానికి అప్రస్తుతానికి నడుమ జ్ఞాపకాల వల

Dreams: The Natural Cinemascope of Life Rejoiced
Dreams: The Virtual Reality Kaleidoscope of Moments Cherished

ಒಳ್ಳೆಯ ಕವಿತೆ, ಕಮಲ ಗಾರು

~ഷ്രീധര്