Wednesday 5 December 2018

నీడయే చాలు

నీ చరణ కమలాల నీడయే చాలు ఎందుకోయీ స్వామి బృందావనాలు.

Thursday 22 November 2018

తామర

కొలనులో నిండిన తామరల అందాలను లోకం గమనించ గలదు కానీ, 
ఆ కొలనులో నిండి ఉన్న బురదనీటిని చూడలేదు

కార్తీకపౌర్ణిమ శుభాకాంక్షలు.

Thursday 26 July 2018

మనసు

వేకువ చిరునవ్వులు నాకోసం చిందించకున్నా
నిన్నటి కలలలోనే నువ్వింకా సంచరిస్తున్నావు
మనసు నిట్టూర్పు కన్నీళ్ళను ఒలుకుతోంది
నా గాయాలకు ఊతం నీవు నొప్పి నాది
అవసరానికి నేనని తెలుసుకున్నపుడు
నిలదీయలేని నిస్సహాయత నాదే కదా
ఓడిన ఆశయాలేవీ నీ సమక్షంలో సేదతీరలేదు
అవసరాలు అదృష్టం కష్టంగా సర్దుకున్నాయిగా
చీకటికీ చిరునవ్వుకీ మధ్య సవాలక్షసార్లు సంధి చేశాను
సహనం నాకు శిక్షగా విసుగు నా సొంతమైంది ఇప్పుడు

Sunday 1 July 2018

మనసే

నన్ను ఎవరో చూచిరి..కన్నె మనసే దోచిరి
చూపులోనే ఆపలేని మత్తుమందు జల్లిరి

Saturday 19 May 2018

భావనలు

వేదనా భావనలు నాలో లోలోన
ఏదో తెలియని ఆసరా కోసం 
తోడు నీడ కోసం వేలాడుతున్నాయి  
ఏదో నీడ ఆసరా కోసం వెతుకుతూ
అందుబాటులో లేని నీ కోసం పరితపిస్తూ 
ఆవేశంతో ఆవేదనకు లోబడి 
మదిని వ్యధలతో నింపుకుని
కంటనీరు ఇంకేలా రోధిస్తున్న హృదయం!  

Wednesday 11 April 2018

మౌనం

నా ప్రణయం ప్రళయం నీవై
కట్టలు తెగిన కన్నీళ్ళు ప్రవహిస్తుంటే
ఓదార్చే ధైర్యం లేక ఒడిపోయాను
మది గోడలు మౌనసాక్షులైనాయి
మౌనంగా మరలిన నీమనసుని మరువలేక
జ్ఞాపకాలు గుండెల్లో చేరి గాయం చేస్తుంటే
నన్ను నేను ఓదార్చునేది ఎలా
గాయాలను పూడ్చేది ఎలా???

Friday 9 March 2018

బాస..

నీవు రోజు నాతో కలిసి ఉండకపోవచ్చు
కాని నా ఉహల్లో ప్రతి క్షణం నాతోనే ఉంటావు
నాకు రాత్రి నిద్రలో కలగా తోడు ఉంటావు
నాకు చావైనా బ్రతుకైనా అన్నీ నీతోనే
స్వార్ధంలా కనిపించినా నా ప్రేమ నిజమైనది
నా స్వప్నం చెదరనీయకు నాకు దూరమవ్వకు
ప్రేమ ఒక అపోహ వేదన అని రుజువు చేయకు..

Monday 12 February 2018

నీ సన్నిధి

నీ పలకరింపుకు పరవశించి
తనువు పరిమళం వెదజల్లె 
నీ సన్నిధి పులకరింపులో
క్షణాలన్నీ కరిగిపోయె మాటలతో
నీ పొందుకోసం సాగే నిరీక్షణలలో
గడియలు ఎన్నైనా సాగనీ ఆకాంక్షలో   
నీ చేరువలో పొందే ఆనందంలో
సాగిపోనీ జీవితాన్ని మధురానుభూతులలో

Sunday 4 February 2018

చలించ

నవ్వే సెలయేరుగా పారి
అందులో కమలమై కొలువుంటా
చూపే వెన్నెలను చేసి
ఆ వెన్నెల్లో వెలిగిపోతా
మనసు మహాసముద్రము అయితే 
అందులో సూక్ష్మబిందువునౌతా
కష్టనష్టాలు ఎన్ని ఎదురైనా 
చలించక నిలబడతా..

Wednesday 24 January 2018

నేనొక కలగన్నాను...


కలగా నువ్వు నా కలలోకి రాగా 
నా నిద్ర నీలాకాశంలో కలై ఎగసింది  
అసంపూర్తి కలల్ని వదిలే యత్నంలో
నేనూ ఎగిరెగి పడి లేస్తున్నాను 
రంగుల రెక్కలు కట్టుకుని
ఆశగా ఆకాశంలో ఎగురుతుంటే
అనుకోకుండా నేలపై జారి పడ్డాను
కళ్ళు తెరచి చూస్తే చెదరిన నిద్ర
కల నుండి జారిపడింది నా నీడ!

Thursday 11 January 2018

కలత

కలల కెరటాలు పొంగుతున్నవి
కలతలు కనులలో రేగుతున్నవి 
ఆశలు ఏవో ఎగసిపడుతున్నవి 
మనసులో భయం రేగుతున్నది
నీలి నీడలు భయపెడుతున్నవి  
ఊసులెన్నో మౌనం దాల్చినవి 
కీచురాళ్ళ శబ్ధం భయపెడుతున్నది
కానరాని చీకటి నాలో కమ్ముకున్నది..

Wednesday 3 January 2018

సంబంధం

నేను వేదనలో ఉన్నానని
భారం మోయలేని నా గుండె 
బాధతో ముక్కలయ్యింది..
నాలో ప్రేమ ఉంది కనుక 
కనులు అశృవులతో తడిసినాయి
బాధకు ప్రేమకు అవినాభావ సంబంధం 
కనుకనే ప్రేమ వేదన పెనవేసుకున్నాయి