Thursday 26 October 2017

సుందర స్వప్నం

చొరవ చేసి చెలీ అని పిలిచి
కలుపుగా కలిసి అలుపు తీర్చి 
సరిక్రొత్త బంధం పెనవేసావు..

కలగనని వైనం కంటికి చూపి
వెన్నెల కూడిన తేజం అందించి
సుందర స్వప్నం అయినావు.. 

ఎడారిలాంటి గొంతు తడార్చి
గుండెలలో సవ్వడి మ్రోగించి  
నన్ను వీడక నాతో ఉన్నావు..

5 comments:

Sri[dharAni]tha said...

కనుల లోగిలిలో స్వప్నమై తేలే ప్రతి జ్ఞాపకం
నిద్రలేక అలసిన కనులకు సాంత్వన చేకూరేనా
చంద్రవంక వీనుల వీధిలో నయనాలు చూసేనా
కంటినిండుగ నిద్ర కలిగితే కథలన్ని కలలౌను కలలన్ని కథలౌను

చక్కని ప్రేరణాత్మక కవిత కమల గారు

26.10.2017
23:26

ghousuddin shaik said...

ఎడారిలాంటి గొంతు తడార్చి
గుండెలలో సవ్వడి మ్రోగించి
నన్ను వీడక నాతో ఉన్నావు.
అద్భుతమైన ఫీల్

Sri[dharAni]tha said...

కార్తీక పౌర్ణమి శుభాభినందనలు మీకు కమల గారు

NANI said...

కలల నుంచి ప్రేమలోగిలి మార్చినారు పయనం..బాగుంది

కమల said...

Sridhar Bukya, nathooram nani, Ghousuddin Shaik, mee comments ku dhanyavadamulu.