Friday 17 November 2017

వాస్తవ కలలు..

మనం మన్లో చిదిమేసిన ఊహలు
బలవంతగా అణిచి వేసిన కోరికలు 
మన నిద్రలో మన వివేకం నిద్రపోయాక
కలల రూపంలో స్వైర విహారం చేస్తుంటాయీ.. 
కలల్లో మనం చూస్తాం వింటాం మాట్లాడతాం
పంచేంద్రియాలు పనిచేస్తున్నట్లే అనిపిస్తుంది
ఎన్ని కలలు కన్నా దేనికదే ప్రత్యేకం..
అందుకే కలలు కలలే వాస్తవాలు కావు!!!

2 comments:

Sri[dharAni]tha said...

లోకంతో మమేకమయ్యేవి వాస్తవాల రూపురేఖలు
కలలన్ని మనసున దాగిన ఊహల ఆనవాలు
వాస్తవాన్ని జీర్ణించుకుంటే కలలన్ని కలవరింతలు
స్వప్నాన్ని జీర్ణించుకుంటే వాస్తవాలన్ని పలవరింతలు
వేటికవే సాటి.. వాస్తవ కలలు.. కాల్పనిక ఊహలు
చక్కగ కలను కనులకింపుగా రచించారు కమల గారు

తీపిగుర్తులు said...

కలలు అన్నీ కల్లబొల్లి కబుర్లు