Wednesday 27 December 2017

ఆనందపు కలలు

కలలు చిట్లిపోగానే నిదుర లేచాను 
వేకువలో మరో క్రొత్తవెలుగు చూడాలని  
ఎన్నాళ్ళైనా ఆశగా ఎదురు చూస్తుంటాను 
ఆలోచన స్వాధీనంలోకి రాక మొరాయిస్తుంటే
మెదడులో మోసుకుని తిరుగుతూనే ఉంటాను.
ఆశ పుట్టిన రాత్రుల్లో ఆశ చావని రాత్రుల్లో
చలికి ముడుచుకునే వేళ్ళన్నింటినీ పైకెత్తి
ఊహల్లోని బొమ్మలను గీసి చుసుకుంటాను
వెలుగు నన్ను తాకినప్పుడల్లా ఓడిపోతూ
రాత్రి వెనుక రాత్రి జారినప్పుడు గెలుస్తున్నట్లు
కలల్లో ఆనందపు అంచులు తాకుతాను...  

2 comments:

Sri[dharAni]tha said...

"కల"తలెరుగని "కల"వరింత "కల"కాలం
"క"థలా సాగే జీవిత గతిగమనము ఇ"ల"
"క"నురెప్ప"ల" అలికిడిలో "క"నుమరుగాయేనే"ల"
"క"మ్మని భావాలెన్నో కనుల లోగిలిలో తచ్చాడే వేళ"ల"
"క"కావికలమైన "మ"నసుని "ల"యగతులతో వర్ణించే మీ అక్షరమాల కమల గారు

Sri[dharAni]tha said...

ముక్కోటి ఏకాదశి మరియు ముక్కోటి ద్వాదశి శుభాభినందనలు మీకు కమల గారు