Wednesday 30 August 2017

నా స్వప్నాలు

కన్నుల వెనుక స్వప్నంలో
మాటల వెనుక మౌనంగా
శ్వాస వెనుక స్పందనలా
విజయం వెనుక శ్రమవలె
గమ్యం వెనుక పయనమై
ఉండేవే నా కలలు ఊహలు 

3 comments:

Sri[dharAni]tha said...

కలలన్ని కనుల సొంతం
మాటలన్ని భావాల సొంతం
భావాలన్ని ఆలోచనల సొంతం

స్పందించే హృదయం లయగతులుగా
ఉరుకులు తీసే సెలయేరు రసరమ్యంగా
ప్రకృతి నంతటిని కలలుగా కమనీయంగా
చిత్రికరించే మనసు ఉప్పొంగే ఆహ్లాదకరంగా

చక్కని పదాలతో మరో చక్కని కవితనందించినారు కమల గారు మీ చౌపంక్తి తో

సాహిత్యం said...

కలలు జీవితానికి
ఎంత అవసరమో
వాటిని నిజం చేసే
ప్రయత్నం మరింత అవసరం
నిద్రిస్తే ఫ్రీగా వస్తున్నాయంటూ
కావలసినన్ని కలలు కని
ఆపై ఆలోచిస్తూ ఆశగా
ఎదురుచూడం అవివేకం..

జీవన పయనం - అనికేత్ said...

నేను ఒక ఇసుక పువ్వును
అందినట్లే అంది చేజారిపోతాను