Sunday 3 October 2021

నీ జ్ఞాపకాలు


వద్దన్నా వినని జ్ఞాపకం మరింత దగ్గరై

నువ్వుంటే…ఎంత బాహుండునో కదా

అనే ఆలోచనలు మరింత ఊపిరాడనివ్వక

కనురెప్పల్ని మూయనివ్వక ఎత్తనివ్వడంలేదు 

నన్ను దగ్గరికి హత్తుకుని ఓదార్చే చేతులకోసం 

ఏ లోతులు కొలవలేని నా నిస్సహాయతను చూసి

నీపై ఉన్న వెర్రి వ్యామోహాన్ని కొలుస్తూ

వెక్కిరింతగా కనుబొమ్మలు ఎగురవేస్తూ 

వ్యంగగా పెదవులు విప్పార్చి నవ్వుతున్నాయి!


Saturday 27 February 2021

నేను..

ఎవరికీ చెప్పక పోలిక లేకుండానే

దేనిలోనూ పొంతనలేని నేను ఉన్నాను..

వెక్కిరించే బంధాలు ఎక్కువై ఏడుస్తున్నాయి

విస్మరించాల్సిన ఘటనలు దిక్కయ్యాయి..

బతుకు ఎంత బలీయమైనదంటే 

నాచేతులే నా గొంతును నొక్కేస్తున్నాయి..

జీవితం ఒక పదునైన ఆయుధంలా మారి

నా గుండెను నేనే ముక్కలు చేసేస్తున్నాయి..

విధి విచిత్రమైనదిగా మారి రంగులు అద్దుకుని

నా ముఖాన్ని నేనే గుర్తుపట్టనట్లు చేస్తున్నాయి..

నేను ఎంచుకొన్న బాట చంచలమైనదిగా

నడుస్తున్న నన్ను చాపలా చుట్టివేసి విసిరేస్తున్నది.

Monday 13 July 2020

కలలు కన్నా..

ఎన్నో ఊహలు ఊహించి 
ఏవేవో కలలు కన్నాను..
నీవు నేను ఒకటిగా ఏకమై
పయనించాలని తపించాను!
పల్లవి అనుపల్లవి తోడైతే 
రసరాగం పాడాలని అనుకుని
ఏవేవో కలలు కన్నాను నేను! 

Sunday 21 June 2020

కలలు

నిశ్చింతగా నిదురపోతే కలలు వస్తాయి
వచ్చిన కలలు ఆనందాన్ని ఇస్తాయి..  
కలలు ఎప్పుడూ కమ్మగానే ఉంటాయి
కష్టాలను రుచి చూడవేమో అందుకని..
నిదురరాని కనులకు కలలు కూడా రావు 
అలసిన కనులు కళను కోల్పోతాయి.. 

Monday 25 May 2020

మార్పు

ప్రతీవేకువా ఓ వసంతకాలం
బిజీగా మొదలౌతుందిపగలు
అలసటతో వచ్చే సాయంత్రం
రాత్రితో దొరికే దానికి విశ్రామం 
ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపినా
ఎంత కన్నీళ్లతో దిండు తడిచినా
మరో ఉదయం రాక మానదు.. 
మళ్ళీ మనం వసంతకాలం చూడకపోము!