Friday 15 December 2017

కలలో వచ్చి

నీ కనులతో కళ్ళు కలిపి 
నన్ను నేను ఓడిపోయాను 
మనసు దోచి దాగుడుమూతలు 
దీపం వెలిగించి చీకటి చేసావెందుకు?
కలలో వచ్చి కునుకు దోచావు
మెలకువలో ఒంటరిని చేసావెందుకు?
నీ ప్రేమలో వెర్రిదాన్ని అయితి
నీతో మనసు ఇచ్చేసి
నన్ను నేను కోల్పోయాను..
నిన్ను కలవకపోతే  నా కనులు
వెర్రి మనసు నిశ్చింతగా నిదురోయేది   

3 comments:

Sri[dharAni]tha said...

ప్చ్.. హయ్యో..
కనుల కొలను ఆలోచనల ధాటికి ఆవిరైపోయే
కలలన్ని కలత చెంది ముభావానికి లోనయ్యే
కంటిపై కునుకు నిలబడితే కదా కలల లోతు కొలవగ
ఆశలన్ని అడియాశల ఊబిలో చేజారి కలవగ
కలత నిదురలో ఎఱ్ఱని కన్నుల లోగిలిలో
కలగా మెదిలి కనుమరుగాయేనా చీకటిలో

భాష ప్రయోగం చక్కగ ఉంది కమల గారు
ధనుర్మాసపు శుభాభినందనలు మీకు

Padmarpita said...

ప్రేమ వైఫల్యం... :(

సాహిత్యం said...

నా ఆశల బాసలు
కలల కవితలు
మాటలలో చెప్పలేక
బాష తెలియక రాక
హృదయం పరితపిస్తుంది.