Friday, 17 November 2017

వాస్తవ కలలు..

మనం మన్లో చిదిమేసిన ఊహలు
బలవంతగా అణిచి వేసిన కోరికలు 
మన నిద్రలో మన వివేకం నిద్రపోయాక
కలల రూపంలో స్వైర విహారం చేస్తుంటాయీ.. 
కలల్లో మనం చూస్తాం వింటాం మాట్లాడతాం
పంచేంద్రియాలు పనిచేస్తున్నట్లే అనిపిస్తుంది
ఎన్ని కలలు కన్నా దేనికదే ప్రత్యేకం..
అందుకే కలలు కలలే వాస్తవాలు కావు!!!

Thursday, 9 November 2017

కల

కళ్ళుమూసుకుని కలలు 
కన్నంత సులభం కాదు
కనులు తెరచి కలలను 
జీవితంలో నిజం చేసుకోవడం! 

Thursday, 26 October 2017

సుందర స్వప్నం

చొరవ చేసి చెలీ అని పిలిచి
కలుపుగా కలిసి అలుపు తీర్చి 
సరిక్రొత్త బంధం పెనవేసావు..

కలగనని వైనం కంటికి చూపి
వెన్నెల కూడిన తేజం అందించి
సుందర స్వప్నం అయినావు.. 

ఎడారిలాంటి గొంతు తడార్చి
గుండెలలో సవ్వడి మ్రోగించి  
నన్ను వీడక నాతో ఉన్నావు..

Monday, 9 October 2017

కమ్మని కల

తన తలపుల్లో తనువు తల్లడిల్లే
తలచినదే తడువుగా తను అగుపడ  
తన్మయత్వపు తమకంలో తనువు తడిసె
తనలో నేను నాలో తను ఏకమవ్వాలని
జగమును మరిచి తరించాలని..
కోరికలు ఎన్నో తలపులలో తిడిగాడె 
తన కోసం నేను నాకోసం తను 
పుట్టామని మనసు గట్టిగా పలికె
కలలోనైనా తీరు అమేయముగా తోచె
కమ్మని కల నిజమైతే ఎంత మధురమో!

Thursday, 28 September 2017

కల

కలయైనా నిజమైనా నిరాశలో ఒకటే

పగలైనా రేయైనా అంధునికి ఒకటేలే

Monday, 11 September 2017

ఆసరా

నాకూ తెలుసునులే..
కంటున్నవీ కనబోయే కలలు
కల్పితాలనీ, ఆశలు అసంకల్పితమనీ
అయినా జీవించడానికి ఏవో కొన్ని
అభూత కల్పనలు ఆసరా కావాలి కదా!