Monday, 12 February 2018

నీ సన్నిధి

నీ పలకరింపుకు పరవశించి
తనువు పరిమళం వెదజల్లె 
నీ సన్నిధి పులకరింపులో
క్షణాలన్నీ కరిగిపోయె మాటలతో
నీ పొందుకోసం సాగే నిరీక్షణలలో
గడియలు ఎన్నైనా సాగనీ ఆకాంక్షలో   
నీ చేరువలో పొందే ఆనందంలో
సాగిపోనీ జీవితాన్ని మధురానుభూతులలో