Wednesday 3 January 2018

సంబంధం

నేను వేదనలో ఉన్నానని
భారం మోయలేని నా గుండె 
బాధతో ముక్కలయ్యింది..
నాలో ప్రేమ ఉంది కనుక 
కనులు అశృవులతో తడిసినాయి
బాధకు ప్రేమకు అవినాభావ సంబంధం 
కనుకనే ప్రేమ వేదన పెనవేసుకున్నాయి 

1 comment:

Sri[dharAni]tha said...

ఎడారిలో ఇసుక తిన్నె వన్నె
అలసిన మనసుకు భావాల వన్నె
కలువ కన్నులకు స్వప్నాల వన్నె
ఎగిసే ఊపిరి లయగతులకు ఉనికి వన్నె

నిజమే ఎక్కాల్సిన రైలు చూస్తుండగానే కదిలెళ్ళితే షాక్
రాతిరి ట్రేయిన్ అనక ఆర్టీసి బస్సు నెక్కి మరుసటి రోజు మరొక ట్రేయిన్ ఎక్కి పట్ట పగటికి బదులు మిట్ట మధ్యాహ్నం ఆయే అదో బహుపరాక్