Wednesday 24 January 2018

నేనొక కలగన్నాను...


కలగా నువ్వు నా కలలోకి రాగా 
నా నిద్ర నీలాకాశంలో కలై ఎగసింది  
అసంపూర్తి కలల్ని వదిలే యత్నంలో
నేనూ ఎగిరెగి పడి లేస్తున్నాను 
రంగుల రెక్కలు కట్టుకుని
ఆశగా ఆకాశంలో ఎగురుతుంటే
అనుకోకుండా నేలపై జారి పడ్డాను
కళ్ళు తెరచి చూస్తే చెదరిన నిద్ర
కల నుండి జారిపడింది నా నీడ!

4 comments:

Sri[dharAni]tha said...

నేనొక కలగన్నాను
ఆ కలలో నేనున్నాను
నేనొక కలగన్నాను
ఆ కలలో వేచి చూస్తున్నాను
నేనొక కలగన్నాను
ఆ కలలో ఏకాకిలా నడయాడుతున్నాను
నేనొక కలగన్నాను
ఆ కల నిజమవ్వాలనుకున్నాను
నేనొక కలగన్నాను
ఆ కలను కలగానే మిగిలిపోమన్నాను
నేనొక కలగన్నాను
ఆ కల నుండి తేరుకుని భోరుమన్నాను

Dhamoo said...

why so painful dream?

తెలుగమ్మాయి said...

ఈ కలలు వేదనాభరితం

Balu said...

very nice kamala