నా ప్రణయం ప్రళయం నీవై కట్టలు తెగిన కన్నీళ్ళు ప్రవహిస్తుంటే ఓదార్చే ధైర్యం లేక ఒడిపోయాను మది గోడలు మౌనసాక్షులైనాయి మౌనంగా మరలిన నీమనసుని మరువలేక జ్ఞాపకాలు గుండెల్లో చేరి గాయం చేస్తుంటే నన్ను నేను ఓదార్చునేది ఎలా గాయాలను పూడ్చేది ఎలా???
నీవు రోజు నాతో కలిసి ఉండకపోవచ్చు కాని నా ఉహల్లో ప్రతి క్షణం నాతోనే ఉంటావు నాకు రాత్రి నిద్రలో కలగా తోడు ఉంటావు నాకు చావైనా బ్రతుకైనా అన్నీ నీతోనే స్వార్ధంలా కనిపించినా నా ప్రేమ నిజమైనది నా స్వప్నం చెదరనీయకు నాకు దూరమవ్వకు ప్రేమ ఒక అపోహ వేదన అని రుజువు చేయకు..
నీ పలకరింపుకు పరవశించి తనువు పరిమళం వెదజల్లె నీ సన్నిధి పులకరింపులో క్షణాలన్నీ కరిగిపోయె మాటలతో నీ పొందుకోసం సాగే నిరీక్షణలలో గడియలు ఎన్నైనా సాగనీ ఆకాంక్షలో నీ చేరువలో పొందే ఆనందంలో సాగిపోనీ జీవితాన్ని మధురానుభూతులలో
నవ్వే సెలయేరుగా పారి అందులో కమలమై కొలువుంటా చూపే వెన్నెలను చేసి ఆ వెన్నెల్లో వెలిగిపోతా మనసు మహాసముద్రము అయితే అందులో సూక్ష్మబిందువునౌతా కష్టనష్టాలు ఎన్ని ఎదురైనా చలించక నిలబడతా..
నేను వేదనలో ఉన్నానని భారం మోయలేని నా గుండె బాధతో ముక్కలయ్యింది.. నాలో ప్రేమ ఉంది కనుక కనులు అశృవులతో తడిసినాయి బాధకు ప్రేమకు అవినాభావ సంబంధం కనుకనే ప్రేమ వేదన పెనవేసుకున్నాయి