Wednesday, 24 January 2018

నేనొక కలగన్నాను...


కలగా నువ్వు నా కలలోకి రాగా 
నా నిద్ర నీలాకాశంలో కలై ఎగసింది  
అసంపూర్తి కలల్ని వదిలే యత్నంలో
నేనూ ఎగిరెగి పడి లేస్తున్నాను 
రంగుల రెక్కలు కట్టుకుని
ఆశగా ఆకాశంలో ఎగురుతుంటే
అనుకోకుండా నేలపై జారి పడ్డాను
కళ్ళు తెరచి చూస్తే చెదరిన నిద్ర
కల నుండి జారిపడింది నా నీడ!

Thursday, 11 January 2018

కలత

కలల కెరటాలు పొంగుతున్నవి
కలతలు కనులలో రేగుతున్నవి 
ఆశలు ఏవో ఎగసిపడుతున్నవి 
మనసులో భయం రేగుతున్నది
నీలి నీడలు భయపెడుతున్నవి  
ఊసులెన్నో మౌనం దాల్చినవి 
కీచురాళ్ళ శబ్ధం భయపెడుతున్నది
కానరాని చీకటి నాలో కమ్ముకున్నది..

Wednesday, 3 January 2018

సంబంధం

నేను వేదనలో ఉన్నానని
భారం మోయలేని నా గుండె 
బాధతో ముక్కలయ్యింది..
నాలో ప్రేమ ఉంది కనుక 
కనులు అశృవులతో తడిసినాయి
బాధకు ప్రేమకు అవినాభావ సంబంధం 
కనుకనే ప్రేమ వేదన పెనవేసుకున్నాయి