Wednesday, 27 December 2017

ఆనందపు కలలు

కలలు చిట్లిపోగానే నిదుర లేచాను 
వేకువలో మరో క్రొత్తవెలుగు చూడాలని  
ఎన్నాళ్ళైనా ఆశగా ఎదురు చూస్తుంటాను 
ఆలోచన స్వాధీనంలోకి రాక మొరాయిస్తుంటే
మెదడులో మోసుకుని తిరుగుతూనే ఉంటాను.
ఆశ పుట్టిన రాత్రుల్లో ఆశ చావని రాత్రుల్లో
చలికి ముడుచుకునే వేళ్ళన్నింటినీ పైకెత్తి
ఊహల్లోని బొమ్మలను గీసి చుసుకుంటాను
వెలుగు నన్ను తాకినప్పుడల్లా ఓడిపోతూ
రాత్రి వెనుక రాత్రి జారినప్పుడు గెలుస్తున్నట్లు
కలల్లో ఆనందపు అంచులు తాకుతాను...  

Friday, 15 December 2017

కలలో వచ్చి

నీ కనులతో కళ్ళు కలిపి 
నన్ను నేను ఓడిపోయాను 
మనసు దోచి దాగుడుమూతలు 
దీపం వెలిగించి చీకటి చేసావెందుకు?
కలలో వచ్చి కునుకు దోచావు
మెలకువలో ఒంటరిని చేసావెందుకు?
నీ ప్రేమలో వెర్రిదాన్ని అయితి
నీతో మనసు ఇచ్చేసి
నన్ను నేను కోల్పోయాను..
నిన్ను కలవకపోతే  నా కనులు
వెర్రి మనసు నిశ్చింతగా నిదురోయేది   

Wednesday, 6 December 2017

కలల విందు

కునుకులమ్మ తీపికలల విందు చేసింది
ఆవలింతల ఆకు వేసి రమ్మని పిలిచింది 
చీకటి చెదిపోయే వరకూ నిదురపోయి 
వేకువ వచ్చి మేలుకొలిపే వరకూ 
కలల విందును ఆరగించమంది......