Monday, 25 May 2020

మార్పు

ప్రతీవేకువా ఓ వసంతకాలం
బిజీగా మొదలౌతుందిపగలు
అలసటతో వచ్చే సాయంత్రం
రాత్రితో దొరికే దానికి విశ్రామం 
ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపినా
ఎంత కన్నీళ్లతో దిండు తడిచినా
మరో ఉదయం రాక మానదు.. 
మళ్ళీ మనం వసంతకాలం చూడకపోము!

Friday, 1 February 2019

కలువ

చీకటి కోనేరులో విరిసిన కలువను
పచ్చనోటు చూసి పైట తొలగిస్తాను 
పక్కదారిలో పయనించే  ప్రతిమగవాడికీ
సొగసుల పువ్వులు సరసంగా అందిస్తాను 
మోసానికి గురై వంచన వలలో చిక్కాను 
చాలీచాలని అతుకుల బ్రతుకు కూడదని 
పిల్లలకు చాలీ చాలని తిండితో చంపలేక
వలపుఅంగట్లో అమ్ముడై బ్రతుకుతున్నా..

Friday, 4 January 2019

నీ జాడ

జగతి సుందరమనోహరం అయితే నీవందు లేవేలనో 
సూర్యచంద్రులు వచ్చిపోతున్నారు నీ జాడ లేదాయె
నీ నీడకై అలుపులేని నాపయనం సాగిస్తుంటినాయె
దాహార్తితో సాగుతున్న పయనం ఎన్నటికి కడతేరేనో 
దూరమెంత దగ్గరాయెనో మనసులంత దూరమాయె
సమయపు ఇసుకతిన్నెపై పేర్లు వ్రాసి వెళ్లిపోతివాయె
దక్కకచేజారిన వలపే స్వచ్ఛమైనదని నిరూపిస్తివాయె
నింగీ నేలలా కలవక అసంపూర్తిగానే మిగిలిపోతిమాయె! 

Wednesday, 5 December 2018

నీడయే చాలు

నీ చరణ కమలాల నీడయే చాలు ఎందుకోయీ స్వామి బృందావనాలు.

Thursday, 22 November 2018

తామర

కొలనులో నిండిన తామరల అందాలను లోకం గమనించ గలదు కానీ, 
ఆ కొలనులో నిండి ఉన్న బురదనీటిని చూడలేదు

కార్తీకపౌర్ణిమ శుభాకాంక్షలు.