Friday, 1 February 2019
Friday, 4 January 2019
నీ జాడ
జగతి సుందరమనోహరం అయితే నీవందు లేవేలనో
సూర్యచంద్రులు వచ్చిపోతున్నారు నీ జాడ లేదాయె
నీ నీడకై అలుపులేని నాపయనం సాగిస్తుంటినాయె
దాహార్తితో సాగుతున్న పయనం ఎన్నటికి కడతేరేనో
దూరమెంత దగ్గరాయెనో మనసులంత దూరమాయె
సమయపు ఇసుకతిన్నెపై పేర్లు వ్రాసి వెళ్లిపోతివాయె
దక్కకచేజారిన వలపే స్వచ్ఛమైనదని నిరూపిస్తివాయె
నింగీ నేలలా కలవక అసంపూర్తిగానే మిగిలిపోతిమాయె!

Wednesday, 5 December 2018
Thursday, 22 November 2018
Saturday, 29 September 2018
Thursday, 26 July 2018
మనసు
నిన్నటి కలలలోనే నువ్వింకా సంచరిస్తున్నావు
మనసు నిట్టూర్పు కన్నీళ్ళను ఒలుకుతోంది
నా గాయాలకు ఊతం నీవు నొప్పి నాది
అవసరానికి నేనని తెలుసుకున్నపుడు
నిలదీయలేని నిస్సహాయత నాదే కదా
ఓడిన ఆశయాలేవీ నీ సమక్షంలో సేదతీరలేదు
అవసరాలు అదృష్టం కష్టంగా సర్దుకున్నాయిగా
చీకటికీ చిరునవ్వుకీ మధ్య సవాలక్షసార్లు సంధి చేశాను
సహనం నాకు శిక్షగా విసుగు నా సొంతమైంది ఇప్పుడు
Sunday, 1 July 2018
Subscribe to:
Posts (Atom)