Wednesday, 11 April 2018

మౌనం

నా ప్రణయం ప్రళయం నీవై
కట్టలు తెగిన కన్నీళ్ళు ప్రవహిస్తుంటే
ఓదార్చే ధైర్యం లేక ఒడిపోయాను
మది గోడలు మౌనసాక్షులైనాయి
మౌనంగా మరలిన నీమనసుని మరువలేక
జ్ఞాపకాలు గుండెల్లో చేరి గాయం చేస్తుంటే
నన్ను నేను ఓదార్చునేది ఎలా
గాయాలను పూడ్చేది ఎలా???