Monday 25 May 2020

మార్పు

ప్రతీవేకువా ఓ వసంతకాలం
బిజీగా మొదలౌతుందిపగలు
అలసటతో వచ్చే సాయంత్రం
రాత్రితో దొరికే దానికి విశ్రామం 
ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపినా
ఎంత కన్నీళ్లతో దిండు తడిచినా
మరో ఉదయం రాక మానదు.. 
మళ్ళీ మనం వసంతకాలం చూడకపోము!

1 comment:

Sri[dharAni]tha said...

నిదురలేని రాత్రులన్ని ఆలోచనలతో యుద్ధానికి కేటాయించి
తీర ఉదయమంత కంటిపై కునుకు రాకుండ ఓర్పు వహించి
సాయంకాలం సడలిన సూర్యునిలా నీరసం ఆవహించి

సాగుతూనే ఉంటుంది కాల చక్రం
తడవక మానవు కన్నీళ్ళతో దిళ్ళు
అంచేతనే చాకచిక్యంగా తలగడలు వేసుకోను నేను
లేదంటే నేను భోరున విలిపించిన మూగ వేదన ఆ తడిలో తెలిసిపోతుందిగా..